విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారులు అందుబాటులో ఉండాలి – ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 22 (ప్రాంతీయ వార్త ప్రతినిధి):ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో నూతనంగా డీఈఈగా పదవీ బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణను పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో విద్యుత్‌శాఖకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నాయకులు కోరారు. ముఖ్యంగా విద్యుత్ స్తంభాల ఏర్పాటు, పొలాల్లో రైతులకు అవసరమైన విద్యుత్ సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.ప్రజలకు విద్యుత్‌శాఖ సేవలు సకాలంలో అందేలా ఏడీ, ఏఈ, లైన్‌మెన్, జేఎల్‌ఎం అధికారులు...