(ప్రాంతీయ వార్త ప్రతినిధి జులై 08)
కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్
పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపు*
నూతన కమిటీల సభ్యులకు నియామక పత్రాల అందజేత*
తాడ్వాయి టౌన్‌లోని మా గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కమిటీల సభ్యులను అభినందించి, వారికి నియామక పత్రాలను అందజేశారు. పార్టీ అభివృద్ధిలో నూతన కమిటీల పాత్ర కీలకమని పేర్కొంటూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి చేరేలా విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. అలాగే ప్రతి పౌరుడు తన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేలా చైతన్యం తీసుకురావాలని కోరారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరితో SIR దరఖాస్తు పత్రాలు నింపించి సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (BLO) అందేలా సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ స్థాయి నాయకులు, నూతన కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
