ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రైవేట్ పాఠశాలల్లో పెంచుతున్న ఫీజులు అరికట్టాలి. బి ఎస్ పి పార్టీ

ప్రైవేట్ పాఠశాలల్లో పెంచుతున్న ఫీజులు అరికట్టాలి. బి ఎస్ పి పార్టీ

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 13

కామారెడ్డి జిల్లా కేంద్రం బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మాలోత్ హరిలాల్ నాయక్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో పెంచుతున్న ఫీజులు అరికట్టాలి, తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టాన్ని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం విద్యార్థుల ఫీజులు, బుక్స్, నోట్స్, యూనిఫామ్లు షూస్, టై, బెల్ట్ లు ఇలా ప్రతి ఒక్కటి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర్నుంచి కొనాలని, సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై మరింత భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. విద్యను వ్యాపారంగా మార్చకుండా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ప్రైవేట్ పాఠశాలల ఫీజులు నియంత్రణ కు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై అధిక బరువు ఉన్న పుస్తకాల భారాన్నికూడా తగ్గించే చర్యలు తీసుకోవాలని, ప్రతి ప్రవేట్ స్కూల్లో ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల పిల్లలకు 20% ఉచితంగా విద్యను అందజేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అమలుపరచకపోవడం తనే విద్యాశాఖ మంత్రిగా ఉండి ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు తో ఒక కమిటీని వేసి ఫీజు నియంత్రణ చేయకపోవడం సిగ్గుచేటు మీరు వెంటనే రైట్ టు ఎడ్యుకేషన్ హక్కు చట్టాన్ని వెంటనే అమలుపరిచి ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పిల్లల ఫీజుల నియంత్రణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రైవేటు స్కూళ్లకు ఒకే ధరల పట్టిక అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఫీజు విధానాన్ని రూపొందించి అమలు చేయాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకొని విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాలను కాపాడాలని, బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఇందులో పాల్గొన్నవారు జిల్లా ఉపాధ్యక్షులు కోకొండ రాజేందర్, కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్ ఈసిరికాయల సాయిలు, కామారెడ్డి అసెంబ్లీ అధ్యక్షులు నత్తి జీవన్, ఎల్లారెడ్డి అసెంబ్లీ అధ్యక్షులు మర్లు సాయిబాబు, ఎల్లారెడ్డి అసెంబ్లీ ఉపాధ్యక్షులు కుసుల కంటి సాయిలు, కామారెడ్డి అసెంబ్లీ కోశాధికారి బానోత్  పిర్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!