ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 11
🔹తరుగు, రవాణా పేరుతో రైతుల వద్ద నుంచి రూ.1,200 కోట్ల కప్పం కట్టించుకున్న సిగ్గులేని ప్రభుత్వం ఇది
🔹మట్టి తల్లిని అలుసుగా చూస్తూ వ్యవసాయాన్ని కర్మకు వదిలేస్తున్నారు
🔹ప్రభుత్వాలకు ఉక్కు సంకల్పం ఉంటే వ్యవసాయ రంగంలో అద్భుతాలు చేయవచ్చు
🔹వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్న సౌకర్యాలు రైతులకు ఇవ్వాలి
🔹రైతును రాజు చేసేందుకు తెలంగాణ రక్షణ సేన ప్రత్యేక కార్యాచరణ చేపడుతుంది
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ..
🔹ప్రభుత్వాలకు ఒక విధానం, ఉక్కు సంకల్పం ఉంటే ఎలాంటి సమస్యనైనా తీర్చవచ్చు.
🔹కానీ రైతుకు ఏదో దయచూపుతున్నాం. బిచ్చం వేస్తున్నమన్నట్లు గా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి.
🔹రైతు ఏదో నాలుగు డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవటం కాదు. పని బిడ్డను కాపాడుకున్నట్లు కాపాడుకోవాలి.
🔹మన దేశంలో రైతులు వ్యవసాయం వదిలేస్తున్నారన్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి.
🔹వ్యవసాయాన్ని కాపాడుకోవాలంటే దాన్ని ఒక పరిశ్రమగా చూడాలి.
🔹ఒక పారిశ్రామికవేత్తకు వాళ్ల పరిశ్రమ పెట్టుకోవటానికి ప్రభుత్వం ఏ విధంగా అన్ని వసతులు కల్పిస్తుందో అదే విధంగా రైతుకు కల్పించాలి.
🔹మట్టి తల్లిగా అలుసుగా చూస్తూ వ్యవసాయాన్ని ఏదో కర్మకు వదిలేస్తున్నారు.
🔹మేము రైతును రాజు చేస్తామని చెబుతున్నాం. అంటే దాని వెంటబడి వ్యవసాయాన్ని బాగు చేసే వరకు వదలం.
🔹వ్యవసాయాన్ని పరిశ్రమగా చూడాలని నేను ఎంపీగా ఉన్నప్పుడే పార్లమెంట్ లో మాట్లాడాను.
🔹ఒక పారిశ్రామిక వేత్తకు ఏ విధమైన గౌరవం దక్కుతుందో రైతుకు కూడా అలాంటి గౌరవమే దక్కాలి.
🔹రాష్ట్ర వ్యాప్తంగా క్రాప్ కాలనీలు ఏర్పాడాలి. పార్టీలతో సంబంధం లేకుండా రైతు సంఘాలు ఏర్పాటు కావాలి.
🔹ముఖ్యంగా రైతు పండించిన పంటకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి.
🔹నేను నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు జగిత్యాల మామిడి పండ్లకు బ్రాండ్ క్రియేట్ చేశాను.
🔹ఢిల్లీలో వాటిని అమ్మేలా ఏర్పాటు చేశాను. ఇప్పటికీ కూడా ఢిల్లీలో జగిత్యాల బ్రాండ్ మామిడి పండ్లను అమ్ముతున్నారు.
🔹జగిత్యాల మామిడి పండు 90 రోజులు నిల్వ ఉంటుంది. అందుకు తగిన విధంగా మేము మార్కెట్ సౌకర్యాలు కల్పించాం.
🔹ఏదైనా వస్తువుకు బ్రాండ్ క్రియేట్ చేస్తే విలువ పెరుగుతుంది.
🔹లక్ష్మీపూర్ రైతులు క్రియేట్ చేసిన వరి బ్రాండ్ ను చూసి జగిత్యాల మామిడి పండ్లకు నేను బ్రాండ్ క్రియేట్ చేశాను.
🔹ఆ అనుభవంతో చెబుతున్న నల్గొండలో బత్తాయి రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తాం.
🔹ఈ ప్రభుత్వం క్వింటాకు 6 కిలోల చొప్పున తరగు తీస్తూ రైతులకు వెయ్యి కోట్లకు పైగా నష్టం చేసింది.
🔹పైగా రవాణా, ప్యాకింగ్ ఖర్చులన్నీ రైతుల మీదే వేసి వారిపై మరో 2 వందల కోట్ల భారం మోపింది.
🔹రైతులకు నష్టం చేస్తుంది సరిపోలేదన్నట్లుగా వారి నుంచే 12 వందల కోట్లు రేవంత్ రెడ్డి కప్పం కట్టించుకున్నాడు.
🔹రైతులకు నష్టం చేస్తున్న ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి.
🔹ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మీద రివ్యూ చేయాలి.
🔹రైతులకు యూరియ దొరకని పరిస్థితి ఉంటే ఒక మంత్రి తన గన్ మెన్ల పేరుతో గోడౌన్ లో నిల్వ చేసుకుంటున్నాడంట.
🔹వరి ఎక్కువ అవుతోందని ప్రభుత్వం చెబుతోంది. కానీ పంటమార్పిడి పై నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందా?
🔹ఉంటే ఇప్పటి వరకు రైతులతో ఎందుకు ఈ అంశంపై చర్చించలేదు.
🔹ఇలాగే ఉంటే మరో నాలుగు నెలల్లో మళ్లీ 75 లక్షల మెట్రిక్ టన్నుల వరి వస్తుంది.
🔹మళ్లీ కొనుగోలు చేయలేని పరిస్థితి తలెత్తుతుంది.
🔹నివారించే పరిస్థితి ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
🔹నల్గొండ లో నీటి ప్రాజెక్ట్ లు ఎండిపోయి నీళ్లు రావటం లేదు.
🔹చిన్న లిప్ట్ ల మెయింటెనెన్స్ ను పట్టించుకోకపోవటంతో అవి పనిచేయటం లేదు.
🔹ఇరిగేషన్ మంత్రి ఈ జిల్లాకు చెందిన వ్యక్తే అయినప్పటికీ పట్టించుకోవటం లేదు.
🔹36 శాతం మంది కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారు.
🔹వాళ్లను గుర్తించి వారికి రైతు భరోసా ఇవ్వాలి. రైతు కూలీలకు ఇస్తామన్న 12 వేలు ఇవ్వాలి.
🔹వ్యవసాయాన్ని గ్రామీణ ఉపాధి హామీకి అనుసంధానం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పట్టించుకోవటం లేదు.
🔹రైతులు పడ్డ బాధలు చూడలేక బంధూకులు ఎత్తిన నేల ఇది.
🔹రైతుల సమస్యలు పోవాలంటే మనమంతా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.
🔹ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మనం పది తీర్మానాలు చేసుకున్నాం.
🔹1. రైతు డిస్కం వద్దు, 2 యూరియ యాప్ తీసేయాలి, 3 బకాయి పడ్డ రైతు భరోసా తక్షణమే ఇవ్వాలి
🔹4 కౌలు రైతులను గుర్తించి వారికి రైతు భరోసా ఇవ్వాలి. 5 రైతు కూలీలకు రూ. 12 వేలు ఇవ్వాలి.
🔹6. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
🔹7. మూసీ కాలుష్యాన్ని నివారించాలి. 8 నిమ్మ, బత్తాయి రైతులకు అండగా ఉండాలి.
🔹9 పత్తి రైతుల సమస్యలను పట్టించుకోవాలి. 10 రైతు సమస్యలపై ఉమ్మడి కార్యాచరణతో భవిష్యత్ ఉద్యమాలు
🔹ఇక ఈ ప్రభుత్వం ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే పని మొదలుపెట్టాలి.
🔹కానిస్టేబుల్ ఉద్యోగాలు 5 వేలు కాదు 20 వేల పోస్టులు వేయాలి.
🔹ఎస్సై జాబ్ కు 35 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉందో కానిస్టేబుల్ జాబ్ కు కూడా అదే విధంగా ఇవ్వాలి.
🔹జీవో 46 ను వెంటనే రద్దు చేసి నిరుద్యోగులకు మేలు చేయాలి.
🔹ఇక ఉద్యమకారుల కోసం కూడా మేము పోరాటం చేయనున్నాం.
🔹జులై 2 న ఉప్పల్ భగాయత్ లో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోబోతున్నాం.
🔹ఈ పోరాటానికి నల్గొండ జిల్లా నుంచి ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలి రావాలి.
నల్గొండ జిల్లా హోటల్ మనోరమాలో తెలంగాణ రక్షణ సేన అధ్యర్యంలో నిర్వహించిన తెలంగాణ రైతు సమస్యలపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత.
RELATED ARTICLES
