ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeతెలంగాణకామారెడ్డిచిరుతపులి దాడిలో లేక దూడలు మృతి

చిరుతపులి దాడిలో లేక దూడలు మృతి

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 18

బాధితుడు రమేష్ ఆదివారం రాత్రి తన పశువుల పాకలో లేగ దూడలను కట్టివేసి ఉంచాడు. అర్ధరాత్రి సమయంలో పాకపై దాడి చేసిన చిరుత పులి.. రెండు లేగ దూడలను అక్కడికక్కడే చంపేసింది. మరో దూడను కొంతదూరం లాక్కెళ్లి హతమార్చినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ దాడి వల్ల తనకు సుమారు రూ. 50 వేల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు. తాను కూలి పనులు చేసుకునే నిరుపేదనని అన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని రమేష్ వేడుకున్నాడు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్: సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ జాదవ్ రేణుక గణపతి తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుడిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అటవీ ప్రాంతానికి సమీపంలో తండాలు ఉండటంతో చిరుత పులుల సంచారం ఎక్కువైందని తెలిపారు. దీంతో తండావాసులు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారని పేర్కొన్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి తండావాసులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

అటవీశాఖపై గ్రామస్థుల ఆగ్రహం: గతంలో కూడా ఈ ప్రాంతంలో వన్యప్రాణులు పశువులపై దాడులు చేసినా.. అటవీశాఖ అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తం అవ్వాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నష్టపోయిన రైతు కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!