చిరుతపులి దాడిలో లేక దూడలు మృతి
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 18 బాధితుడు రమేష్ ఆదివారం రాత్రి తన పశువుల పాకలో లేగ దూడలను కట్టివేసి ఉంచాడు. అర్ధరాత్రి సమయంలో పాకపై దాడి చేసిన చిరుత పులి.. రెండు లేగ దూడలను అక్కడికక్కడే చంపేసింది. మరో దూడను కొంతదూరం లాక్కెళ్లి హతమార్చినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ దాడి వల్ల తనకు సుమారు రూ. 50 వేల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు. తాను కూలి పనులు చేసుకునే నిరుపేదనని అన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఆర్థిక సహాయం అందించి...