దేశ సేవకులకు ఘనంగా సత్కారం..

0
17

📰 Generate e-Paper Clip

కామారెడ్డి మే 16 ప్రాంతీయ వార్త

“జై జవాన్, జై కిసాన్ నినాదాలతో మర్మరోగిన తాడ్కోల్ గ్రామ పంచాయతీ”
రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, ఆరుగాలం కష్ట పడే రైతు లాభపేక్ష లేకుండా పంటలు పండించి దేశానికి కడుపు నింపుతుండని తాడ్కోల్ గ్రామ సర్పంచ్ అందే రమేష్ అన్నారు. బుధవారం నాడు టీ ఎం ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాడ్కోల్ గ్రామానికి చెందిన సైన్యం లో సేవలు అందిస్తున్న బండ హరిచరణ్ రెడ్డి కి, గ్రామానికి చెందిన కౌలు రైతు పుట్టి గంగారాం ల కు సత్కార కార్యక్రమం లో సర్పంచ్ మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టె రైతులకు సేంద్రియ ఎరువులతో పంటలు పండించేలా వ్యసాయ నిపుణులు తగు సలహాలు ఇస్తూ ఉండాలని సర్పంచ్ రమేష్ సూచించారు. బుడ్మి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు గంగుల గంగారాం మాట్లాడుతు దేశం లో ప్రజలు సంతోషాలతో ఉన్నారంటే సరిహద్దు లో రాత్రనాక పగలనక గస్తీ కాచే సైనికులతో నని, మనం కడునిండా అన్నం తింటున్నా మంటే ఏడాది పొడువునా రైతు పంట పండించి మన ఆకలి తీరస్తున్నాడని అన్నారు.వీరిద్దరిని గుర్తించి ఉమ్మడి జిల్లా లో టీ ఎం ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు టీ వీరేశం ను చైర్మన్ గంగారాం అభినందించారు. మాజీ బుడ్మి సహకార సంఘం చైర్మన్ పోతుల బోగుడ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ మన ప్రాంతం నుండి యువత సైన్యం లో చేరడానికి మన అందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆరోగ్య కరమైన సమాజం కోసం మనందరం ఆర్గానిక్ పంటలకు మొగ్గుచుపాలని బుడ్మి సోసైటీ మాజీ చైర్మన్, న్యాయవాది ఎం భూషణ్ రెడ్డి అన్నారు. తాను కూడా ఆర్గానిక్ పంటలు పండించ చడానికి కొంత కాలం ప్రయత్నం చేశానని అన్నారు. దేశానికి వెన్నెముక లు గా భావించి సైనికులకు వందనం -రైతులకు నీరాజనము కార్యక్రమం చేపట్టమని టీ ఎం ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు టీ వీరేశం అన్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 84మంది సైనికులు, రైతులకు సత్కరించుకున్నామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో గంగుల గంగారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్, పి. గోపాల్ రెడ్డి, మాజీ చైర్మన్, షేక్ సాజీద్ ఉప సర్పంచ్, పెద్దాపురం వెంకట్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్, మాశెట్టి రాఘవేందర్, బాన్సువాడ వ్యాపారవేత్త ,బొప్పిడి రాజారెడ్డి రైతుబంధు అధ్యక్షులు అల్లి జగన్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, బొప్పిడి భూమరెడ్డి వార్డు సభ్యులు. బాన్సువాడ నుండి గౌరీశెట్టి అంజయ్య. వీరభద్ర సత్యనారాయణ, గ్రామ యువత గ్రామ పెద్దలు చాలామంది తదితరులు హాజరైనారు.
సైనికుని తండ్రి సంగారెడ్డి మాట్లాడుతూ తమ పిల్లలు దేశ రక్షణలో ఉండడం సంతోషమని వీరిని సన్మానించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు.
సైనికులు ,రైతులు దేశానికి రెండు కళ్ళ లాంటి వారని , వీరిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
జాతీయ గీతంతో కార్యక్రమం ముగిసింది…

Leave a reply

Please enter your comment!
Please enter your name here