(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 22 )
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని *లింగంపేట్ మండలం , మోతే గ్రామంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను ఎమ్మెల్యే*మదన్ మోహన్ గారు* పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అత్యాధునిక సౌకర్యాలతో విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థను నిర్మిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, వసతి గృహాలు, క్రీడా మైదానాలు, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి అన్ని మౌలిక వసతులు అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పూర్తయిన తర్వాత ఎల్లారెడ్డి నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన, ఆధునిక విద్య అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, ఇంజినీర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నరు
రూ.200 కోట్లతో మోతే గ్రామంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మదన్ మోహన్,
RELATED ARTICLES
