(ప్రాంతీయ వార్త ప్రతినిధి ఎల్లారెడ్డి, ఆగస్టు 23:)
ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఆగస్టు 24న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు సర్వం సిద్ధమైంది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హత కలిగిన యువతీ యువకులకు ప్రముఖ కంపెనీల్లో 5,000కుపైగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగ మేళాల నిర్వహణ ఇప్పుడే ప్రారంభించిన కార్యక్రమం కాదని, ఎన్నికలకు ముందే తన సొంత ఖర్చుతో పలు జాబ్ మేళాలు నిర్వహించి ఎంతోమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్న మదన్ మోహన్ సేవలను పలువురు అభినందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నిరుద్యోగ సమస్యను కొంతవరకు తగ్గించేందుకు ఇలాంటి జాబ్ మేళాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ తదితర విద్యార్హతలు కలిగిన యువతీ యువకులు తమ విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను పొందేందుకు ఈ జాబ్ మేళాకు హాజరు కావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మరింతమంది యువతకు ఉపాధి లభించాలని, మదన్ మోహన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని పలువురు ఆకాంక్షించారు.
యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా
RELATED ARTICLES
