ePaper
Tuesday, November 17, 2026
ePaper
Homeఎడిటోరియల్మాధవపల్లి ప్రాథమికోన్నత.పాఠశాలలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు

మాధవపల్లి ప్రాథమికోన్నత.పాఠశాలలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి ఆగస్టు 06)


కామారెడ్డి జిల్లా గాంధారి మండల్ మాధవ పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు పోచయ్య మాట్లాడుతూ , ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని. ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప మేధావిగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేయాల్సిన. బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీజ. ఉపాధ్యాయులు మౌనిక. సువర్ణ. విద్యార్థులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!