(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి )
రామాలయ నిర్మాణానికి ₹5.50.116 రూపాయలు విరాళం
రామేశ్వర్ పల్లి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న శ్రీ రామాలయ నిర్మాణం కొరకు ప్రముఖ సైంటిస్ట్ శ్రీ పైడి ఎల్లారెడ్డి గారు హనుమత్ సమేత శ్రీ సీతారామ చంద్రుల విగ్రహాల కొరకు రూ.5.5.116 రూపాయలు చెక్ రూపంగా విరాళం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన సేవాభావాన్ని అభినందిస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ మద్ది చంద్రకాంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు శ్రీ మద్ది సూర్యకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీమతి చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్ గొల్లపల్లి వినోద్ గౌడ్, టెంపుల్ డైరెక్టర్ రమేష్ రెడ్డి, చంద్ర రెడ్డి గారు, మాజీ విడిసి అధ్యక్షులు తక్కళ్ళ నర్స రెడ్డి, రెడ్డి గారి నరేందర్ రెడ్డి, Bms నాయకులు రవీందర్ రెడ్డి గ్రామ అభివృద్ధి కమిటీ పాలకవర్గ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు అఖిలపక్ష నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రామాలయ నిర్మాణానికి శ్రీ పైడి ఎల్లారెడ్డి గారు అందించిన విరాళం గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. గ్రామంలోని రామ భక్తులు, దాతలు కూడా ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించి రామాలయ నిర్మాణాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పైడి ఎల్లారెడ్డి గారు కామారెడ్డి జిల్లా రామేశ్వరం పల్లి గ్రామంలో రామాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయంగా 5,50,116 (ఐదు లక్షల యాభై వేల నూట పదహారు) రూపాయలు విరాళం చేయడం జరిగింది
RELATED ARTICLES
