నిజాంసాగర్, ప్రాంతీయ వార్త ప్రతినిధి:
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని బంజపల్లి, సుల్తాన్ నగర్ గ్రామాలకు నూతన గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను నియమించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టారు.
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజా పండరి నేతృత్వంలో ఈ నియామకాలు చేపట్టారు. ఇందులో భాగంగా బంజపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా గాండ్ల రమేష్‌ను, సుల్తాన్ నగర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా షేక్ చాంద్ పాషాను నియమించారు.
నూతనంగా నియమితులైన అధ్యక్షులు గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది. గ్రామస్థాయిలో పార్టీకి మరింత బలమైన పునాది కల్పించేందుకు కృషి చేయాలని పార్టీ నాయకత్వం ఆకాంక్షిస్తోంది.
ఈ నియామకాలతో ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు మరింత చురుగ్గా సాగుతాయని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
నిజాంసాగర్‌లో నూతన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం.
RELATED ARTICLES
