(ప్రాంతీయ వార్తా ప్రతినిధి రవి జూలై 27)
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో ప్రెస్ క్లబ్, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ భవనాలు నిర్మించాలని కోరుతూ సోమవారం నాడు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్ కేంద్రమైన ఎల్లారెడ్డి పట్టణంలో ప్రెస్ క్లబ్, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ భవనాలు లేక ఇబ్బందులు కుంటున్నారని, ఆ భవనాలు నిర్మిస్తే ఎల్లారెడ్డి చుట్టుపక్కల గ్రామాలు వివిధ మండలాల ప్రజల అవసరాలకు అనుగుణంగా అందరికి ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. అధికారులు, నాయకులు చొరవ తీసుకొని ప్రెస్ క్లబ్ ఆర్, అండ్ బి గెస్ట్ హౌస్ భవనాల నిర్మాణం కోసం కృషి చేయాలని. అదేవిధంగా. ఎల్లారెడ్డి ఇంద్రనగర్ రోడ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా. డాక్టర్ BR అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం స్థలం ఉన్నందున డాక్టర్ BR అంబేద్కర్ భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి ఎల్లారెడ్డి అసెంబ్లీ అధ్యక్షులు.మర్లు సాయి బాబు. ఉపాధ్యక్షులు కుసుల కంటి సాయిలు తదితరులు.పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిలో ఆర్ అండ్ బి అతిథి గృహం నిర్మించాలని ఆర్డీవోకు వినతి పత్రం
RELATED ARTICLES
