)ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి సెప్టెంబర్ 08 )
గాంధారి, సెప్టెంబర్ 8: గాంధారి మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద మేడిపల్లి గ్రామానికి చెందిన దళిత విద్యార్థి మేడిపల్లి అనిల్ ఎంబీబీఎస్ (MBBS) సీటు సాధించిన సందర్భంగా ఘనంగా సన్మానించారు.
దళిత విద్యావంతులు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు మరియు నాయకులు కలిసి అనిల్‌ను అభినందిస్తూ సన్మానం నిర్వహించారు. కష్టపడి చదివి వైద్య విద్యలో సీటు సాధించడం దళిత సమాజానికి గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. యువత విద్యను ఆయుధంగా చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ బంగారి శంకర్, సంఘం రాజు, డైరెక్టర్ బాలన్న, పి. సాయికుమార్, దండకం సాయిలు, ప్రవీణ్ కుమార్, గంగారం, సంతోష్, భూమేష్ తదితరులు పాల్గొని మేడిపల్లి అనిల్‌ను అభినందించారు.
దళిత బిడ్డగా వైద్య విద్యలో అడుగుపెట్టిన మేడిపల్లి అనిల్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి సమాజానికి సేవ చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆకాంక్షించారు.