ePaper
Sunday, November 15, 2026
ePaper
Homeఎడిటోరియల్భూంపల్లి గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ  పండగ.

భూంపల్లి గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ  పండగ.

📰 Generate e-Paper Clip

(ప్రాంతీయ వార్త ప్రతినిధి)

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ భూంపల్లి గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ  పండుగ . ఈ సందర్భంగా గడ్డ సవిత మాట్లాడుతూ  తంగేడు. గునుగు. చామంతి. వంటి లభించే పూలతో. బతుకమ్మను పేర్చడం ఈ పండుగలోనే ప్రత్యేకత. ప్రకృతిలోని సాజంగా లభించే పూలకు ప్రాధాన్యమివ్వడం ద్వారా మనుషులు తమ చుట్టూ ఉన్న పర్యావరణంతో ఎంతో సన్నిహితంగా ఉండేవారో . సంప్రదాయం గుర్తుచేస్తుంది. చెరువులు కుంటలు పంట పొలాలు. గ్రామీణ జీవనంతో ముడిపడిన బతుకమ్మ. ఎంగిలిపూల బతుకమ్మగా మొదలై. సద్దుల బతుకమ్మ సంబరాంగ ముగిసే తొమ్మిది రోజుల వైభవం  మన సంస్కృతిని చాటి మన బతుకమ్మ పండుగ. చిన్నపెద్ద ఆటపాటలతో ఊరువాడ మారుమోగుతుంది. మహిళాలు ఒక్క దగ్గర చేరి పాటలు పాడడం ఆడడం మహిళలు తమ ఆనందాన్ని కాదు బాధలు ఆశలు ఆకాంక్షలను  కూడా పంచుకుంటారు. బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు ఆత్మీయతకు ప్రత్యేకంగా నిలుస్తుందని అన్నారు. తరతరాలుగా వస్తున్న తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. పూలను పూజిస్తే ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని నింపుతుందని తెలిపారు చిన్నారులు మహిళలందరూ కుటుంబ సభ్యులకు కలిసి బతుకమ్మ పండుగను సంతోషముగా జరుపుకోవడం జరిగిందన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!