(ప్రాంతీయ వార్త ప్రతినిధి కామారెడ్డి)
ప్రజా పాలనలో అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం: సర్పంచ్ బంగారు శంకర్*”
తిమ్మాపూర్ గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా చేపట్టిన ఉచిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ బంగారు శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన నిరుపేదలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బంగారు శంకర్ మాట్లాడుతూ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా పాలనలో భాగంగా అర్హులైన నిరుపేదలకు ఉచిత స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ సౌందర్య, గ్రామ వార్డు సభ్యులు రాజు, నవీన్, రఘు, సుశాంత్, తిమ్మాపూర్ గ్రామ అధ్యక్షులు రవి, ఇంద్రమ్మ, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్లో ఉచిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సర్పంచ్ బంగారువాడి శంకర్.
RELATED ARTICLES
