(ప్రాంతీయ వార్త ప్రతినిధి )
ఎల్లారెడ్డి లో సీఎం.ఆర్.ఎఫ్, & కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
రూ.2.40 కోట్ల విలువైన 225 సీఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ కళ్యాణలక్ష్మి ద్వారా 33 మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం.ఆర్.ఎఫ్, కళ్యాణలక్ష్మి పథకాల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో *225 మంది లబ్ధిదారులకు రూ.2 కోట్ల 40 లక్షల విలువైన సీఎం.ఆర్.ఎఫ్ చెక్కులను* పంపిణీ చేశారు. అదేవిధంగా, *కళ్యాణలక్ష్మి పథకం* కింద *ఎల్లారెడ్డి మండలానికి చెందిన 17 మంది లబ్ధిదారులకు*, *నాగిరెడ్డిపేట మండలానికి చెందిన 16 మంది లబ్ధిదారులకు* చెక్కులను అందజేశారు.
ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలకు సీఎం.ఆర్.ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడంతో పాటు, అర్హులైన ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోంది.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
