(ప్రాంతీయ వార్త ప్రతినిధి అక్టోబర్ 11)
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో ఎస్సీ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తూ గాంధారి మండల కేంద్రంలో శనివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో 59 దళిత ఉపకులాల రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గాంధారి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సంఘం రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలు కీలక తీర్మానాలను ఆమోదించారు.
సమావేశంలో చేసిన ప్రధాన తీర్మానాలు:
1. చైర్మన్ పదవుల్లో ప్రాధాన్యత: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇంకా మిగిలి ఉన్న ఆరు పీఏసీఎస్ చైర్మన్ పదవుల్లో ఐదు పదవులను ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలని తీర్మానించారు.
2. డైరెక్టర్ పదవుల కేటాయింపు: పీఏసీఎస్ డైరెక్టర్ పదవుల్లో ఎస్సీ సామాజిక వర్గానికి 35 పదవులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు.
3. రిజర్వేషన్ల అమలు: పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని తీర్మానించారు.
4. గాంధారి పీఏసీఎస్ చైర్మన్ పదవి: గాంధారి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ తీర్మానాలను అమలు చేసి, పీఏసీఎస్ పదవుల్లో దళిత సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌కు సమావేశం ద్వారా విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
పలు మండలాల నాయకుల హాజరు.
ఈ సమావేశంలో తాడ్వాయి మండల సమాచార హక్కు చట్టం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెగ్గేలా రాజు, ఎమ్మార్పీఎస్ గాంధారి మండల ప్రధాన కార్యదర్శి చిమ్మన్ సాయిలు, అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి గైని రాజలింగం, లింగంపేట ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గన్నారం అల్లూరి, లింగంపేట అంబేద్కర్ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనర్సింలు, రామారెడ్డి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు రాములు, గాంధారి పట్టణ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు గడ్డమీద ప్రవీణ్‌కుమార్, గాంధారి మండల మాదిగ సేవా సమితి ప్రధాన కార్యదర్శి మ్యాటర్ సంజీవులు, ఎమ్మార్పీఎస్ గాంధారి మండల ఉపాధ్యక్షులు దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన దళిత ఉపకులాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు. పీఏసీఎస్ పదవుల్లో సామాజిక న్యాయం, దళితులకు తగిన ప్రాతినిధ్యం కల్పించే అంశాలపై ఐక్యంగా ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు.
పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో దళితులకు ప్రాధాన్యత కల్పించాలి.
RELATED ARTICLES
