ePaper
Tuesday, November 17, 2026
ePaper
Homeఎడిటోరియల్పీఏసీఎస్ ముదేల్లి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

పీఏసీఎస్ ముదేల్లి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

📰 Generate e-Paper Clip

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి ఆగస్టు 11 )

గౌరవ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారి ఆదేశాల మేరకు ముధోల్ పీఏసీఎస్‌కు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
పీఏసీఎస్ చైర్మన్‌గా దాసరి శ్రీకాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించగా, డైరెక్టర్లుగా గుండెల ప్రవీణ్ గౌడ్, కమ్మరి సంగమేష్, కుంటోల్ల లక్ష్మవ్వ, మదర్ కాశిం, ఎడ్ల బాలవ్వ, దొంతుల బోయిన బాలరాజ్, మొహమ్మద్ శాబుద్దీన్, మోగుల సాయిరాం, బాల్గురి సుధాకర్, కేతావత్ దేవి సింగ్, సాయినేని లక్ష్మీబాయి, బ్యాగారి కాశీరం ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా నూతన చైర్మన్ దాసరి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తమపై నమ్మకం ఉంచి పీఏసీఎస్ బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతుల సంక్షేమం, సహకార సంఘం అభివృద్ధి కోసం నూతన కార్యవర్గ సభ్యులందరితో కలిసి సమర్థవంతంగా పనిచేస్తామని అన్నారు. రైతులకు అవసరమైన సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్ బండారి పారామేశ్ గారు DCO రామ్ మోహన్ గారు క్లస్టర్ ఆఫీసర్ నరసింహులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పీఏసీఎస్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!