ePaper
Thursday, November 19, 2026
ePaper
Homeఎడిటోరియల్*యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ ల దిష్టి బొమ్మ దహనం*

*యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ ల దిష్టి బొమ్మ దహనం*

📰 Generate e-Paper Clip

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 24 )

ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసన సభ్యులు మదన్ మోహన్ రావు గారు, కామారెడ్డి జిల్ల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు, ఎల్లారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఇన్చార్జి అబ్బు గారి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సర్దార్ నాయక్ గారి ఆదేశాల మేరకు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండలం లో యూత్  కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్, ప్రధాని నివాసం వద్ద నిరసన తెలిపిన రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించారు. బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి, మోడీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాందాస్ రాజేశ్వర్ గౌడ్, లింగంపేట్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బుర్ర రామ కృష్ణ గౌడ్, టౌన్ అధ్యక్షులు సుల్తాన్, మండల సోషల్ మీడియా  బెస్త నవీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి, మండల నాయకులు శివ, రాజేష్, రమేష్, ఫయాజ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!