ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి.

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి.

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 20

రఘునాథపల్లి మండలం గిద్దెబండ తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లకావత్ సీతారాం గారు మరణించగా ఆయన పార్థివా దేహానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.  అలాగే అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దారావత్ భీమా గారు మరణించగా వారి పార్థివా దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఎమ్మెల్యే గారి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ కాంతమ్మ కిషన్, మండల పార్టీ అధ్యక్షుడు కోళ్ల రవి, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!