ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 19
గాంధారి మండలం గుజ్జుల్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని గుజ్జుల్ డ్యాం వద్ద ఇటీవల ఏర్పడిన సమస్యపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామ పెద్దలు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి డ్యాం రిపేర్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జేసీబీ యంత్రాలతో మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి. డ్యాం పరిధిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ పనులు పూర్తయితే రైతులకు సాగునీటి సమస్య తగ్గడంతో పాటు గ్రామ ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
ఈ సందర్భంగా గుజ్జుల్ తండా గ్రామ పంచాయతీ గ్రామస్తులు, రైతులు పాలక సభ్యులు ఎమ్మెల్యే మదన్ మోహన్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారం చూపుతున్న ఎమ్మెల్యే సేవలను వారు అభినందించారు.
