తిమ్మాపూర్‌లో కొత్త మోటార్ పంపు ఏర్పాటు

తిమ్మాపూర్, సెప్టెంబర్ 19 (ప్రాంతీయ వార్త):గాంధారి మండలంలోని తిమ్మాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు కొత్త మోటార్ కొండికాడ సీఆర్ఐ పంపును ఏర్పాటు చేశారు. గ్రామంలో నీటి సరఫరా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ మోటార్ పంపును బిగించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బంగారి శంకర్, ఉపసర్పంచ్ సౌందర్య, పాలకవర్గ సభ్యులు ఉప్పల వై. రాజు, కారోబార్ రమేష్, శేఖర్, పోసెట్టి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మోటార్ పంపు...