కేంద్ర మంత్రి పదవికి ఈటల రాజేందర్ పేరు..?* *తెలంగాణ బీజేపీలో జోరుగా ప్రచారం*
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 18 తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాష్ట్రంలో పెరుగుతున్న రాజకీయ పరిణామాలు, కేంద్ర మంత్రివర్గంలో మార్పులపై ఊహాగానాల మధ్య తెలంగాణకు చెందిన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో భారీ పునర్వ్యవస్థీకరణ...