5 గంటల పని తర్వాత అరగంట విశ్రాంతి తీసుకోవాలి స్పష్టం చేసిన కేంద్ర కార్మిక శాఖ*

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 18   కొత్త కార్మిక కోడ్‌ అమల్లో భాగంగా ఇక నుంచి వేతన జీవులు, కార్మికులు, ఉద్యోగులు విశ్రాంతి లేకుండా వరుసగా 5 గంటలకు మించి పనిచేయడానికి వీల్లేదని కేంద్ర కార్మికశాఖ స్పష్టం చేసింది. కార్మికులు 5 పని గంటల అనంతరం కచ్చితంగా అరగంట విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య, పని పరిస్థితుల కోడ్‌లోని సెక్షన్‌ 25 ప్రకారం ఈ నిబంధన కచ్చితంగా అమలు చేయాలని సూచిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది....