హైదరాబాదు నుండి తిరుపతి వెళ్లే బస్సుకి అగ్నిప్రమాదం.
కాశం జిల్లా రాజుపాలెం వద్ద హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఇంజిన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణికులను తరలిస్తున్న కావేరి ట్రావెల్స్ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా రాజుపాలెం సమీపంలో బస్సు ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో బస్సును వెంటనే రోడ్డు పక్కన నిలిపివేశారు. బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మంటలు వ్యాపించి పెద్ద ప్రమాదం జరగకముందే, డ్రైవర్ సూచనల మేరకు...