PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 5:22 am Posted by : RAVINDHAR

హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా శివాజీ మహరాజ్ స్మరణ

(ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 06 )

శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్  పట్టాభిషేకుమైనటువంటి రోజు 1674 సంవత్సరం జూన్ 06 తారీకు కావున ఈ సందర్భంగా ఎల్లారెడ్డి లోని చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలవేసి శివాజీ మహారాజ్ గారు చేసినటువంటి ధర్మ కార్యక్రమాలను మరియు ఆయన సాధించిన విజయాలను సమాజంలో ఆయన నడుచుకున్న విధానాన్ని ధర్మం కోసం ఎక్కడికైనా ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలని  ఆ శివాజీ మహారాజ్ని గుర్తు చేసుకుంటూ మనం కూడా భారత దేశంలో హిందువులై పుట్టినందుకు వారి ఆశయాలను కాపాడాలని హిందూ ధర్మం కోసం ఎంతో మంది సమయం ఇవ్వాలని దేశం కోసం ధర్మం కోసం సమయం ఇవ్వాలని సమాజాన్ని కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ నవీన్, తులసి దాస్, వినోద్, రాహుల్ ,హర్ష, సందీప్, పురుషోత్తం,శివ, మరియు ఎల్లారెడ్డి పురపాలక సంఘ 2 వార్డ్ కౌన్సిలర్ విద్య సాగర్, 8 వార్డు కౌన్సిలర్ శ్రీధర్ తో పాటు తదితరులు పాల్గొనడం జరిగింది