PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 5:14 pm Posted by : RAVINDHAR

స్వాన్ ఇండియా నూతన కమిటీ ఏకగ్రీవం

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 22 

గాంధారి మండలం స్వాన్ ఇండియా కమిటీ గా ఎన్నుకోవడం జరిగింది. స్వాన్ ఇండియా గాంధారి మండల అధ్యక్షులుగా. దాసి శ్రీకాంత్ (గాంధారి ) ప్రధాన కార్యదర్శిగా. వజీర్ వసంతరావు ( మాతృ సంగ్యం ) కార్యనిర్వాహక అధ్యక్షులుగా. బొమ్మని వంశీ (గాంధారి ) కాటేవాడి రమేష్ రావు ( పోతంగల్ కాలన్ ) కార్యవర్గ సభ్యులుగా భూపతి,  రమేష్, గోపి, నవనీత, రవళి, వంశీకృష్ణ, సంతోష్ లను  ఎన్నుకోవడం జరిగింది. వీరికి స్వాన్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్. పీబీ. సత్యం గారు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు శ్రీకాంత్, వసంతరావు మాట్లాడుతూ మా సేవలు గుర్తించి మమ్మల్ని గాంధారి మండల బాధ్యులుగా డాక్టర్. పీబీ. సత్యం గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మండలంలోని సోషల్ వర్కర్  అభ్యున్నతికి ముందుండి ఉద్యమం చేస్తూ సమస్యల పరిష్కారానికి మా వంతు బాధ్యత నిర్వర్తిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.