స్థానిక సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ధర్నా

(ప్రాంతీయ వార్త ప్రతినిధి సెప్టెంబర్ 01)గాంధారి: స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. గత వారం రోజులుగా సీపీఎం బృందం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను సేకరించింది. అనంతరం సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేసింది.చిన్నగుట్ట తండాకు చెందిన కొంతమంది పోడు రైతులకు గ్రామసభ ఆమోదం తెలిపినప్పటికీ ఇప్పటివరకు హక్కు పత్రాలు అందలేదని సీపీఎం నాయకులు తెలిపారు. అర్హులైన పోడు రైతులకు వెంటనే హక్కు పత్రాలు అందేలా...