స్థానిక సమస్యలపై సీపీఎం పోరాటం.ఈ నెల 31న మండల కార్యాలయాల ఎదుట ధర్నా – మోతి రామ్ నాయక్

(ప్రాంతీయ వార్త ప్రతినిధి ఆగస్టు 29)గాంధారి: గాంధారి మండలంతో పాటు వివిధ గ్రామాల్లో నెలకొన్న స్థానిక సమస్యల పరిష్కారం కోసం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో అధ్యయనం చేపట్టినట్లు ఎల్లారెడ్డి ఏరియా కార్యదర్శి మోతి రామ్ నాయక్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 31వ తేదీ సోమవారం మండల కార్యాలయాల ఎదుట నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మోతి రామ్ నాయక్ మాట్లాడుతూ రైతులకు, పోడు రైతులకు బ్యాంకులు రుణాలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. చిన్నగుట్ట...