సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి భూమి నిధులు కేటాయించాలి.
నేడు కామారెడ్డి జిల్లాలో కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది.హైదరాబాదు బంజారాహిల్స్ లో సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి 100 ఎకరాలు భూమి కేటాయించి 1000 కోట్ల నిధులతో విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల జనాభా మూడో స్థానంలో ఉందని జనాభా అనుగుణంగా లంబాడీలను ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు లంబాడీల హక్కుల పోరాట సమితి,గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మే 19న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసన ధర్నా కార్యక్రమం ఉంటుందని అదేవిధంగా 30న సడక్ బంద్ శ్రీశైలం హైవేపై నిరసన కార్యక్రమం ఉంటుందని జూన్ 15న కొండారెడ్డిపల్లె నుండి మహా పాదయాత్ర కొనసాగి హైదరాబాద్ అమరవీరుల స్తూపం వద్ద ముగింపు ఉంటుందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గిరిజన విద్యార్థి సంఘం సభావాత్ వినోద్ నాయక్,లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నేనావాత్ గణేష్ నాయక్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో లక్షల కోట్లు కేటాయించిన దేవాలయాలను నిర్మానించిందని ప్రతి గ్రామంలో దేవాలయాలు దర్శనమిస్తాయి కానీ లంబాడి ఆరాధ్య దైవమైన సేవలాల్ మహారాజ్ దేవాలయాల కు ఎటువంటి నిధులు కేటాయించలేదని లంబాడి బంజారా సంఘాలు డిమాండ్ చేశాయి. మా యొక్క జాతికి చెందినటువంటి
సేవాలాల్ మహారాజ్ ఆవులను మీతామేపి మా లంబాడి ఆస్త వ్యవస్థలను చుట్టుపక్కల తండా గుడాలను నిర్మాణం చేసి చైతన్యవంతం కల్పించిన లంబాడి లను ఐక్యత తెచ్చి సేవాలాల్ మహారాజ్ ఇలాంటి మహాపూర్వికులు మా బంజారాలు నివసించిన బంజారాహిల్స్ లోనే జగజంబయాడి సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణం చేయాలి అని ప్రభుత్వానికి (GVS)గిరిజన విద్యార్థి (LHPS)సంఘం, లంబాడి హక్కుల పోరాట సమితి మరియు ప్రజా సంఘాలు ధరావత్ మోతిరాం నాయక్, వెంకన్న, సర్పంచ్ సదర్ నాయక్, మాజీ ఎంపిటిసి శీను నాయక్, దేవిసింగ్ నాయక్, కైలాస్ నాయక్, Advocate అసోసియేషన్ సిద్ధిరాములు ఆజాద్, వివిధ సంఘాలు కూడా పాల్గొనడం జరిగింది.