సుల్తాన్ నగర్‌లో SIR సమీక్ష సమావేశం.. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ దిశానిర్దేశం*

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూలై 1:కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలం సుల్తాన్ నగర్ గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంపై BLAలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే *శ్రీ తోట లక్ష్మీకాంతరావు కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు *శ్రీ ఏలే మల్లికార్జున్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే *తోట లక్ష్మీకాంతరావు గారు, మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు....