ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 31
ఎల్లారెడ్డి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ రావు గారి గురించి గానీ, కాంగ్రెస్ పార్టీ గురించి గానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు. గత ఎన్నికల్లో ప్రజలు మీకు ఇచ్చిన తీర్పు చాలదా? మళ్లీ రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలే సరైన సమాధానం చెబుతారు. వ్యక్తిగత విమర్శలు మానుకుని ప్రజా సమస్యలపై మాట్లాడాలని హెచ్చరిస్తున్నాము. అని గాంధారి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ తో పాటు వివిధ నాయకులు. పాల్గొని విలేకరులు సమావేశంలో మాట్లాడుతూ.
*రైతులను ఆగం పెట్టొద్దు*
మీ ప్రభుత్వ హయాంలో రైతులు, రైస్ మిల్లర్లు, కాంట్రాక్టర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతుల పేరుతో రాజకీయాలు చేయడం మానేసి, రైతుల అభివృద్ధికి సహకరించాలి. రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయవద్దు.
*అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు*
ఈరోజు గౌరవ ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ రావు గారి నాయకత్వంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలల అభివృద్ధి, ఏటీసీ సెంటర్లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, గాందారి పట్టణ సుందరీకరణ,
*ప్రజల తీర్పును గౌరవించండి*
గాందారి ప్రజలు ఇప్పటికే మీ పాలనను తిరస్కరించారు. ఎమ్మెల్యే తో పాటు ఎంపీ ఎన్నికలలో విజయం అందించి తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారు. ప్రజల తీర్పును గౌరవించకుండా అనవసర విమర్శలు చేయడం తగదు.
*అవినీతి రహిత పాలనకు ప్రజల మద్దతు*
గతంలో కాంట్రాక్టర్లపై ఒత్తిడులు, శాతం వ్యవహారాలపై ప్రజలు మాట్లాడుకున్నారు. కానీ నేడు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు పారదర్శకంగా అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నారు.
*కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు ఆలోచించండి*
కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ. అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలనతో ముందుకు సాగుతోంది. ప్రజల సమస్యలపై మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. కార్యక్రమంలో మండల అధ్యక్షులతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ నాయకులు పాల్గొన్నారు.