సర్కారు బడికి పోతే ఇండ్ల పన్ను మాఫీ.. వరంగల్ జిల్లాలో ఊరి జనం ఆదర్శ నిర్ణయం!
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూమ్ 10 వరంగల్: కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీకి చెక్ పెడుతూ, సర్కారు బడులను కాపాడుకునేందుకు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామస్థులు ఒక వినూత్న నిర్ణయంతో ఆదర్శంగా నిలిచారు. గ్రామంలోని పిల్లలందరినీ స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని గ్రామ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఎవరైతే తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపుతారో, ఆ కుటుంబాలకు గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటి పన్ను, నల్లా పన్నుల నుండి పూర్తి మినహాయింపు (టాక్స్ ఫ్రీ) ఇస్తామని గ్రామ సర్పంచ్, పాలకవర్గం...