PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 3:20 pm Posted by : RAVINDHAR

సర్కారు బడికి పోతే ఇండ్ల పన్ను మాఫీ.. వరంగల్ జిల్లాలో ఊరి జనం ఆదర్శ నిర్ణయం!

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూమ్ 10
 వరంగల్: కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీకి చెక్ పెడుతూ, సర్కారు బడులను కాపాడుకునేందుకు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామస్థులు ఒక వినూత్న నిర్ణయంతో ఆదర్శంగా నిలిచారు. గ్రామంలోని పిల్లలందరినీ స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని గ్రామ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఎవరైతే తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపుతారో, ఆ కుటుంబాలకు గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటి పన్ను, నల్లా పన్నుల నుండి పూర్తి మినహాయింపు (టాక్స్ ఫ్రీ) ఇస్తామని గ్రామ సర్పంచ్, పాలకవర్గం ప్రకటించారు. దాంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో సైతం మొదటి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు మూతపడకుండా చూసేందుకు గ్రామస్థులు తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయంపై తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.