సంగోజీవాడిలో మహిళా సంఘ భవనానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ భూమి పూజ<br>
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 02 తాడ్వాయి మండలం సంగోజీవాడి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సంఘ భవనానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ మహిళల సాధికారతకు మహిళా సంఘాలు కీలకమని అన్నారు. మహిళా సంఘ సభ్యులు సమావేశాలు నిర్వహించుకోవడానికి, రికార్డులను భద్రపరచుకోవడానికి శాశ్వత భవనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలు గ్రామాల పర్యటనల్లో తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దీంతో ప్రతి గ్రామానికి మహిళా సంఘ భవనాలు మంజూరు చేయాలని...