PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 3:28 pm Posted by : RAVINDHAR

సంగోజీవాడిలో మహిళా సంఘ భవనానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ భూమి పూజ<br>

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 02

తాడ్వాయి మండలం సంగోజీవాడి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సంఘ భవనానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ మహిళల సాధికారతకు మహిళా సంఘాలు కీలకమని అన్నారు. మహిళా సంఘ సభ్యులు సమావేశాలు నిర్వహించుకోవడానికి, రికార్డులను భద్రపరచుకోవడానికి శాశ్వత భవనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలు గ్రామాల పర్యటనల్లో తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దీంతో ప్రతి గ్రామానికి మహిళా సంఘ భవనాలు మంజూరు చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మహిళా సంఘ భవనాల నిర్మాణం కోసం సుమారు రూ.18 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఇప్పటికే అనేక గ్రామాల్లో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని అన్నారు.
సంగోజీవాడి గ్రామ మహిళా సంఘ సభ్యులు తమ గ్రామానికి తక్కువ సమయంలోనే మహిళా సంఘ భవనం మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.