వర్షాకాల సమస్యల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి  మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 10 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం 10వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ సభకు మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అధ్యక్షత వహించగా, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సభలో వార్డు ప్రజలు తమ ప్రాంతాల్లో ఉన్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్త, మురుగు కాల్వల నిర్వహణ లోపాలు, మూళ్ల పొదల పెరుగుదల, విద్యుత్ సరఫరా అంతరాయాలు, వీధి దీపాల...