(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జులై 20)
లింగంపేట శిశు మందిర్ నూతన భావన నిర్మాణంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి గారిని శిశు మందిర్ పాఠశాల ప్రబంధ ని బృందం కలిసి భవన నిర్మాణంలో మీ వంతు పాత్ర ఉండాలని కోరడం జరిగింది.
అనంతరం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జపాన్ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి గారు శశి మందిర్ నూతన భవన నిర్మాణానికి 1000 సంచుల సిమెంటును ఇస్తానని శిశు మందిర్ పాఠశాల ప్రబంధ గారిని సభ్యులకు తెలియజేయడం జరిగింది.
స్వచ్ఛమైన విద్య విలువలతో కూడినటువంటి విద్యను ఈరోజు శిశుమందిర్ పాఠశాలల్లో నేర్పిస్తున్నారని భారతదేశ సనాతన ధర్మ మరియు కుటుంబ విలువలతో కూడుకున్నటువంటి సంస్కారమైనటువంటి విద్యను ఈరోజు అందిస్తున్న పాఠశాలలు కేవలం శిశు మందిరాలు మాత్రమే అని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
పిల్లలు తన చిన్ననాటి జీవితం నుండే అది గూగుల్ ఉంది సమాజం పట్ల తల్లిదండ్రుల పట్ల మరియు పెద్దలపట్ల ఏ విధమైనటువంటి స్నేహపూరితంగా ఉండాలని అటువంటి విలువలతో కూడినటువంటి విద్యను శిశు మందిరాల్లో అందిస్తున్నారని ఇలాంటి పాఠశాలల నిర్మాణానికి నేను ఎప్పుడు సహకరిస్తానని వారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శిశుమందిర్ ప్రబంధకారిణి సభ్యులు కొత్త దుర్గయ్య, శ్రీనివాస్ గౌడ్, పెద్ది శివయ్య, అంకం గంగాధర్, జంగం రాజేశ్వర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.