PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 8:08 pm Posted by : RAVINDHAR

లింగంపేట్ లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

(ప్రాంతీయ వార్త ప్రతినిధి ఆగస్టు 11)

భారతీయ జనతా పార్టీ లింగంపేట మండల శాఖ ఆధ్వర్యంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశం మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాల్సిన అవసరం ఉందని వారు ఇచ్చిన పిలుపుమేరకు లింగంపేట మండల పార్టీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది.
ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గరిగే రవీందర్ రావు  ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
వారు మాట్లాడుతూ భారత ప్రధాని గారు ఇచ్చిన పిలుపులో భాగంగా  దేశభక్తిని చాటుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని  దేశభక్తులు అందరూ కూడా వారి ఇంటి పై మూడు రంగుల మువ్వన్నెల జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకునే మంచి తరుణమని వారు ఈ సందర్భంగా అన్నారు.
అనంతరం లింగంపేట బీజేపీ మండల అధ్యక్షుడు బొల్లారం క్రాంతికుమార్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశభక్తిని చాటుకోవడానికి మనకు ఇచ్చిన మంచి అవకాశం అని వారి మాటను మనమందరం గౌరవిస్తూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశ గౌరవాన్ని పెంచుతూ దేశభక్తిని చాటుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉందని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా ఈరోజు భారత్ పొందిన పేరుకు మన గణనారాలలో నిండిన దేశభక్తి మోడీ గారికి ఇచ్చినటువంటి ధైర్యమని అందుకే వారు ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని అగ్రగామిగా ఉంచడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్ల రామచందర్ చారి, మండల ప్రధాన కార్యదర్శులు ఆకుల విష్ణువర్ధన్ మార్గం సుభాష్  బీజేవైఎం మండల అధ్యక్షులు మార్గం రజనీకాంత్,కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు రాజారాం బాలయ్య, మండల ఉపాధ్యక్షుడు పెద్ద బోయిన అనిల్, దురిశెట్టి రవి  పట్టణ అధ్యక్షులు నరేష్ భగవాన్, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులు మోతే మల్లయ్య, చింతకుంట రమేష్, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ వడ్ల ఎల్లేశo, దాసరి అనిల్, శ్రీనివాస్ గౌడ్, శివరాత్రి నారాయణ, కస్తూరి కిషన్, శంకర్ నాయక్, బూత్ అధ్యక్షులు బొల్లు గణేష్, మహేష్, సంతోష్, అనిల్, శ్రావణ్,హేమంత్, లింగం, కల్వేటి సాయిలు, అనిల్, ప్రదీప్, లక్ష్మీకాంత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.