ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 02.
—————————————————–
లింగంపేట్ మండల కేంద్రం లోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయిరాం యాదవ్ గోకుల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు జాతీయ జెండా ఎగరవేసి తెలంగాణ నినాదాలు చేశారు.
అనంతరం పార్టీ కార్యాలయంలో మిఠాయిలు పంపిని చేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దయవలనని తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు.
తెలంగాణ తెచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ ప్రజల కళా సాకరమైన రోజు ఎందరో మంది అమరవీరులు విద్యార్థులు మేధావులు ఆత్మ బలిదానం చేసుకున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమరులైన కుటుంబాలను ఆదుకుంటుందన్నారు.
త్యాగాలను గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో లింగంపేట్ గ్రామ సర్పంచ్ కౌడ రవి, ఉప సర్పంచ్ ప్రసాద్ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ దశరథ నాయక్, దిశా కమిటీ సభ్యులు రాజు, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బుర్ర నారా గౌడ్, మాజీ ఎంపీపీ మోహిడ్, సమన్వయ కమిటీ కన్వీనర్ ఎల్లమయ్య, రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకుడు రఫీ యుద్దీన్, మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ వాహబ్, విటల్, వార్డు సభ్యుల గుండా బాలకిషన్, సునీల్, రాజు, నబి, కాసిం, కాంగ్రెస్ నాయకులు హర్షద్, మహేష్ గౌడ్, పాషా, భాస్కర్ గౌడ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.