లింగంపేటలో వైభవంగా పెద్దమ్మ తల్లి బోనాలు కనుల పండగవగా అమ్మవారి కల్యాణ అన్నదానం

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 22మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పెద్దమ్మ తల్లి ఉత్సవాలు రెండో రోజు శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని కనులపండువగా జరిపించారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణం అనంతరం భక్తులకు భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. *సందడిగా బోనాల ఊరేగింపు* సాయంత్రం 5:00 గంటలకు మహిళలు సాంప్రదాయ దుస్తులు...