ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 02.
ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ ప్రయత్నాలకు మరో కీలక ఫలితం దక్కింది. గత ఏడాది కురిసిన భారీ వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న లింగంపేట మండలంలోని *లింగంపల్లి ఖుర్ద్ హై లెవల్ బ్రిడ్జి* మరియు ఎల్లారెడ్డి మండలంలోని *అడివిలింగాల్ హై లెవల్ బ్రిడ్జి పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.8.50 కోట్ల నిధులను మంజూరు చేసింది.
లింగంపేట మండలంలోని లింగంపల్లి ఖుర్ద్ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.4.00 కోట్లు*, ఎల్లారెడ్డి మండలంలోని అడివిలింగాల్ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.4.50* కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఈ రెండు బ్రిడ్జిలు గత ఏడాది వచ్చిన భారీ వరదలతో తీవ్రంగా దెబ్బతిని ప్రజల రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది.
ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు వెంటనే సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించి, ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు మంత్రులతో పలు మార్లు సమావేశమై నిధుల మంజూరుకు ప్రత్యేక చొరవ చూపించారు. నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి బలంగా తీసుకెళ్లి, బ్రిడ్జిల పునర్నిర్మాణం అత్యవసరమని వివరించిన ఫలితంగానే ఈ నిధులు మంజూరైనట్లు స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు.
ఈ హై లెవల్ బ్రిడ్జిల పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత లింగంపేట, ఎల్లారెడ్డి మండలాల ప్రజలకు భారీ ఊరట లభించనుంది. ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించగలుగుతారు. విద్యార్థులు, ఉద్యోగులు, దినసరి ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించగలుగుతారు. వర్షాకాలంలో గ్రామాలు వేరుపడే పరిస్థితులకు శాశ్వత పరిష్కారం లభించనుంది. త్వరలో బ్రిడ్జి టెండర్ వర్క్ పూర్తి చేసి నిర్మాణ పనులు చేపడుతాము అని ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు పనిచేస్తున్నారని స్థానిక ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు ప్రశంసిస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూ ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు.
నిధుల మంజూరుపై స్థానిక ప్రజలు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.