ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 24
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మేడిపల్లి గ్రామ శివారులో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలైనట్లు 108 సిబ్బంది తెలిపారు హనుమాన్ నాయక్ తండాకు చెందిన గంగా సింగ్ యమున ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ఇద్దరికీ గాయాలైనట్లు బాధితులు చెప్పారు 108 సిబ్బంది క్షతగాత్రులను కామారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సిబ్బంది కమలాకర్ పైలట్ గోవర్ధన్ రావు తెలిపారు.