రైతు సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వాలు గద్దె దిగాలి : వేల్పూర్ భూమయ్య
(ప్రాంతీయ వార్త ప్రతినిధి జులై 02.)కామారెడ్డి జిల్లా కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు సూర నర్సయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. రైతు, కూలీల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వాలకు పరిపాలించే నైతిక హక్కు లేదని, అలాంటి ప్రభుత్వాలు గద్దె దిగిపోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విత్తన చట్టం, విద్యుత్ చట్టం వంటి విధానాలు...