రైతులను ఆందోళనకు గురిచేయొద్దు – ధాన్యం తరలింపు వేగవంతం చేస్తున్నాం

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 02.ఎల్లారెడ్డి మండలంలోని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచించారు. ఈరోజు ఎల్లారెడ్డి మండలంలోని శివనగర్ గేట్ సమీపంలోని శబ్దల్పూర్ సెంటర్ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, ఐకేపీ సిబ్బంది సహకారంతో ధాన్యాన్ని తరలించేందుకు లారీలను ఏర్పాటు చేసి లోడ్లను పంపించడం జరిగింది.అదేవిధంగా ఏపీఎం అధికారులతో మాట్లాడి, లారీల కొరత ఉన్న వెలుట్లపేట, సోమార్పేట తదితర కొనుగోలు కేంద్రాలకు కూడా తక్షణమే అదనపు లారీలను పంపించాలని కోరగా, ఆయా కేంద్రాలకు రెండు చొప్పున లారీలను...