రైతంగా పోరాటాన్ని ఉధృతం చేస్తాం – ఏకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు M బిక్షపతి
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 10 కామారెడ్డి పట్టణంలో అఖిల భారత రైతు - కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) 2వ మహాసభ ఘనంగా నిర్వహించబడింది. మహాసభ ప్రారంభానికి ముందు ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు సుర నర్సయ్య సంఘ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభకు రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల బిక్షపతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేల్పూరి భూమయ్య హాజరయ్యారు. ఈ సభకు ఏఐకేఎంఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సుర నర్సయ్య అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మామిడాల బిక్షపతి మాట్లాడుతూ దేశంలో రైతులు, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న...