రేపు మూడు నోటిఫికేషన్లు : TGPSC చైర్మన్

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 01 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) చైర్మన్ బుర్రా వెంకటేశం మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం సుమారు 3,800 ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు వచ్చాయని, వీటి కోసం రెగ్యులర్‌గా నోటిఫికేషన్లు ఇస్తామని తెలిపారు. ప్రతి నెలా సగటున మూడు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పారు.రేపు మూడు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని పేర్కొన్నారు. నీట్ విధానం ద్వారా పరీక్షల నిర్వహణ జరుగుతుందని, భవిష్యత్తులో టీజీపీఎస్సీ పరీక్షల నిర్వహణ ఈ పద్ధతిలోనే కొనసాగుతుందని తెలిపారు.