ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 26.
————————————————–
ఉస్మానియా యూనివర్సిటీ సోషల్ వర్క్ విభాగం నుంచి సీనియర్ ప్రొఫెసర్ డా.పి.విష్ణు దేవ్,మరియు ప్రొఫెసర్ డా .C. గణేష్ , పర్యవేక్షణలో .అనే అంశంపై పరిశోధన పూర్తి చేసినందుకు గాను
రేపని జ్యోతి శ్రీ కి ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగం డాక్టరేట్ నీ ప్రకటించింది.కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని సీతాయి పల్లి అనే మారుమూల గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన రేపని నర్సమ్మ – తిమ్మయ్య దంపతుల మూడవ కుమార్తె జ్యోతి శ్రీ, , తెలంగాణలో సమీకృత శిశు అభివృద్ధి సేవలు( ICDS)కు అంగన్వాడీ కార్యకర్తల యొక్క రోజువారి కార్యకలాపాలు, మరియు బాధ్యతలు,అనే అంశంపై లోతైన పరిశోధన నిర్వహించినందుకు గాను రేపాని జ్యోతి శ్రీ డాక్టర్ పట్టా పొందారు, తన పరిశోధనకు సహకరించిన OU సోషాలజీ HOD ప్రొఫెసర్ డా.పి .విష్ణుదేవ్ ,BOS చైర్మన్
డా.రామ్ షెఫర్డ్ బీనా వేణి,
డా.CH.పరంధాములు గారికి జ్యోతి శ్రీ గారు కృతజ్ఞతలు తెలిపారు. ఐతే జ్యోతి శ్రీ తల్లి ,దండ్రులు నిరుపేదలు అలాగే నిరక్ష రాసులు ఐనప్పటికీ రోజు వారి కూలీ పని చేస్తూ తన పిల్లను చదివించారు వారి ముగ్గురు పిల్లలు రాష్ట్రం లోని ప్రముఖ విశ్వవిద్యాలయం చేసి తల్లి, దండ్రులు పడ్డ కస్టం వృదకాకుండా మంచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయిలో ఉన్నారు సీతైపల్లీ చుట్ట ప్రక్కల గ్రామాల్లో చాలా మంది వీరి కుటుంబాన్ని చూసి వారి వారి కుటుంబాల్లో ఆడపిల్లలను చదివించడానికి ఆసక్తి చూపుతారు
ఆ ఇంటిని సరస్వతి నిలయంగా చెప్పుకుంటారు
మా అమ్మానానాలు పడ్డ కష్టమే మా చదువులు, ఉద్యోగాలు. మేము అనుభవించే ప్రతి సుఖం,సంతోషం వెనక కనిపించని మా తల్లిదండ్రులు చెమట చుక్కలు ఎన్నో దాగి ఉన్నాయి అని జ్యోతి శ్రీ అన్నారు.