PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 5:09 pm Posted by : RAVINDHAR

రాహుల్ గాంధీ అరెస్ట్ ను ఖండిస్తూ. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 22)

రాహుల్ గాంధీ గారు  ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ, అలాగే నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీగ్ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు  ఎల్లారెడ్డి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సర్దార్ నాయక్ గారి ఆధ్వర్యంలో గాంధారి నెహ్రుచౌరస్త దగ్గర శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గాంధారి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సంగసని శ్రీనివాస్ గారు మరియు
మార్కెట్ కమిటీ చైర్మన్ బండరి పరమేష్ గారు,గాంధారి సర్పంచ్ మమయి రేణుకా సంజీవ్ గారు, గాంధారి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చాకలి రాజు గారు , తూర్పు రాజులు, ఆకుల లక్ష్మణ్, కుమ్మరి రాములు,తాడ్వాయి సంతోష్,బొట్టు మొత్తిరం , ముకుండ్ రావు,లైన్ రమేష్, శంకర్ , శంకర్ నాయక్,మోహన్ నాయక్, సంగని బాబా, భాను గౌడ్, ఆంజనేయులు,గణేష్,అచ్యుత్ గౌడ్, విక్రమ్,మంగలి ప్రశాంత్, సాయిరాం,మధర్,
మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది.